Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 15

దావీదు కీర్తన.

యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు?

మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?

నిందారహితంగా నడుచుకొనేవారు,

నీతిని జరిగించేవారు,

తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;

తమ నాలుకతో అపవాదులు వేయనివారు,

పొరుగువారికి కీడు చేయనివారు,

స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;

నీచులను అసహ్యించుకుని

యెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు;

తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు,

తమ మనస్సు మార్చుకొననివారు;

వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు;

నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు.

వీటిని చేసేవారు

ఎన్నటికి కదిలించబడరు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.