Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 14

సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.

“దేవుడు లేడు”

అని మూర్ఖులు1 తమ హృదయంలో అనుకుంటారు.

వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి;

మంచి చేసేవారు ఒక్కరు లేరు.

వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా

అని యెహోవా పరలోకం నుండి

మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.

అందరు దారి తప్పి చెడిపోయారు;

మంచి చేసేవారు ఎవరూ లేరు.

ఒక్కరు కూడా లేరు.

కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా?

వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు;

వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు.

వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు,

ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు.

కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు,

కాని యెహోవా వారి ఆశ్రయము.

సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది;

యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు,

యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!

Source notes (1)
  1. Footnote నైతికంగా లోపం ఉన్నవారు

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.