Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 100

స్తుతి అర్పణ కీర్తన

భూలోకమంతా యెహోవాను స్తుతిస్తూ ఆనంద ధ్వనులు చేయాలి.

సంతోష పూర్వకంగా యెహోవాను సేవించండి;

పాడుతూ ఆయన సన్నిధిలోకి రండి.

యెహోవాయే దేవుడని గ్రహించండి.

ఆయనే మన సృష్టికర్త, మనం ఆయన వారం;

మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.

కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి,

స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి;

ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.

యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది;

ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.