Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 75

సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము.

దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము;

మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం;

ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు.

“నేను నిర్ణీత సమయంలో;

న్యాయంగా తీర్పు తీరుస్తాను.

భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు,

దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. సెలా

అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని

దుష్టులతో, ‘మీ కొమ్ములను1 ఎత్తకండి.

ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి;

అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.

తూర్పు నుండి కాని పడమర నుండి కాని

అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.

దేవుడే తీర్పు తీరుస్తారు:

ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.

యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది

అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది;

ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు

మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.

నేనైతే నిత్యం ప్రకటిస్తాను;

యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.

ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను,

కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.

Source notes (1)
  1. Footnote కొమ్ములను ఇక్కడ బలాన్ని సూచిస్తున్నాయి; 5 10 వచనాల్లో కూడా

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.