Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 70

సంగీత దర్శకునికి. దావీదు అభ్యర్థన కీర్తన.

దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి;

యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి.

నా ప్రాణం తీయాలని కోరేవారు

సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి;

నా పతనాన్ని కోరేవారందరు

అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.

నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు

సిగ్గుపడి ఆశాభంగం పొందాలి.

అయితే మిమ్మల్ని వెదికేవారంతా

మీలో ఆనందించి సంతోషించాలి;

మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు,

“యెహోవా గొప్పవాడు!” అని అనాలి.

కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను;

దేవా! నా దగ్గరకు త్వరగా రండి,

మీరే నా సహాయం, నా విమోచకుడు;

యెహోవా, ఆలస్యం చేయకండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.