Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కీర్తనలు 29

దావీదు కీర్తన.

దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి,

మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.

యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి;

ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.

యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది;

మహిమగల దేవుడు ఉరుముతారు

మహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది.

యెహోవా స్వరం శక్తివంతమైనది;

యెహోవా స్వరం ఘనమైనది.

యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరిగి పడిపోతాయి;

లెబానోను దేవదారు చెట్లను యెహోవా ముక్కలుగా చేస్తారు.

ఆయన లెబానోను పర్యతాలను దూడలా,

షిర్యోనును1 అడవి దూడలా చెంగున గంతులు వేసేలా చేస్తారు.

యెహోవా స్వరం

అగ్ని జ్వాలలను పుట్టిస్తుంది;

యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది.

యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తారు.

యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది

అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది.

ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.

యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు;

ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు.

యెహోవా తన ప్రజలకు బలాన్ని దయచేస్తారు;

యెహోవా సమాధానంతో తన ప్రజలను ఆశీర్వదిస్తారు.

Source notes (1)
  1. Footnote అంటే, హెర్మోను పర్వతం

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.