Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 111
యెహోవాను స్తుతించండి.1
యథార్థవంతుల సభలో సమాజంలో
నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను.
యెహోవా కార్యాలు గొప్పవి;
వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు.
ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి,
ఆయన నీతి నిరంతరం ఉంటుంది.
మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు;
యెహోవా దయామయుడు. కనికరం గలవారు.
భయభక్తులు గలవారిని పోషిస్తారు.
ఆయన తన నిబంధన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు.
తన ప్రజలకు ఇతర దేశాలను వారసత్వంగా ఇచ్చి,
తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడించారు.
ఆయన చేతుల పనులు విశ్వసనీయమైనవి న్యాయమైనవి;
ఆయన కట్టడలు నమ్మదగినవి.
అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి,
నమ్మకత్వంతో యథార్థతతో అవి చేయబడ్డాయి.
ఆయన తన ప్రజలకు విమోచన సమకూర్చారు;
ఆయన తన ఒడంబడికను శాశ్వతంగా నియమించారు,
ఆయన నామం పరిశుద్ధమైనది భీకరమైనది.
యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం;
ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు.
స్తుతి నిత్యం ఆయనకే చెందును.
Source notes (1)
- Footnote హెబ్రీలో హల్లెలూయా
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.