Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

యెషయా 12

స్తుతి పాటలు

ఆ రోజున మీరు ఇలా అంటారు:

“యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను.

మీరు నాపై కోప్పడినా కూడా

మీ కోపం చల్లారింది

మీరు నన్ను ఆదరించారు.

నిజంగా దేవుడే నా రక్షణ;

నేను భయపడను ఆయనను నమ్ముతాను.

యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ;

ఆయనే నా రక్షణ అయ్యారు.”

మీరు రక్షణ బావులలో నుండి

ఆనందంతో నీళ్లు చేదుతారు.

ఆ రోజున మీరు ఇలా అంటారు:

“యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;

దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి,

ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.

యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన మహిమగల కార్యాలు చేశారు;

లోకమంతటికి ఇది తెలియాలి.

సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి,

ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.