Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

కొలొస్సీ పత్రిక 4

యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమాని ఉన్నాడని మీకు తెలుసు కాబట్టి, మీ దాసులకు సరియైనది న్యాయమైనది ఇవ్వండి.

మరిన్ని సూచనలు

కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండి, నిరంతరం ప్రార్థన చేయండి. నేను సంకెళ్ళతో ఉండడానికి కారణమైన క్రీస్తు మర్మాన్ని మేము ప్రకటించడానికి, మా సువార్త పరిచర్యకు దేవుడు ద్వారాలను తెరవాలని మాకోసం కూడా ప్రార్థన చేయండి. నేను ప్రకటించవలసినంత స్పష్టంగా ప్రకటించడానికి నా కోసం ప్రార్థన చేయండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సంఘానికి బయటివారితో జ్ఞానంతో ప్రవర్తించండి. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా కృపతో నిండిన మాటలతో, అందరికి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారిగా ఉండాలి.

చివరి శుభవచనాలు

తుకికు నా సమాచారాన్ని మీకు తెలియజేస్తాడు. అతడు ప్రియ సహోదరుడు, ప్రభువులో నమ్మకమైన పరిచారకుడు నా తోటి సేవకుడు. మీరు మా స్ధితి తెలుసుకోవాలని, అతడు మీ హృదయాలను ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో అతన్ని మీ దగ్గరకు పంపుతున్నాను. అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము వస్తున్నాడు, అతడు మీలో ఒకడు. ఇక్కడి సంగతులన్ని వారు మీకు తెలియజేస్తారు.

నా తోటి ఖైదీలైన అరిస్తర్కుకు బర్నబాకు దగ్గరి బంధువైన మార్కు మీకు వందనాలు చెప్తున్నారు. మార్కును గురించి మీరు ఇంతకుముందే సూచనలు అందుకున్నారు, కాబట్టి అతడు మీ దగ్గరకు వస్తే, అతన్ని చేర్చుకోండి.

యూస్తు అనబడే యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యం కోసం నాతో ఉన్న జతపనివారి మధ్యలో, యూదులు వీరు మాత్రమే ఉన్నారు. వీరు నాకు ఆదరణ కలిగిస్తున్నారు.

క్రీస్తు యేసు సేవకుడును మీలో ఒకడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు పరిపూర్ణులుగా ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి పూర్తి నిశ్చయతగలవారై స్థిరంగా ఉండాలని, ఇతడు ఎప్పుడు మీ కోసం తన ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు. ఇతడు మీ కోసం, లవొదికయలో హియెరాపొలిలో ఉన్న వారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడని ఇతన్ని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను.

మన ప్రియ స్నేహితుడు వైద్యుడైన లూకా, సహోదరుడైన దేమా మీకు వందనాలు చెప్తున్నారు.

లవొదికయలో ఉన్న సహోదరి సహోదరులకు, నుంఫాకు ఆమె గృహంలోని సంఘానికి నా వందనాలు తెలియజేయండి.

ఈ ఉత్తరాన్ని మీరు చదివిన తర్వాత, లవొదికయలోని సంఘంలో కూడా చదివి వినిపించండి. అలాగే లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరు కూడా చదివించండి.

అర్ఖిప్పుకు చెప్పండి: “ప్రభువు నుండి మీరు పొందిన పరిచర్యను మీరు పూర్తి చేసేటట్లు చూడండి.”

పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకముంచుకోండి. కృప మీతో ఉండును గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.