Skip to content
BibleKenya

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 దినవృత్తాంతములు 3

దావీదు కుమారులు

దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు వీరు:

యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను మొదటి కుమారుడు;

కర్మెలుకు చెందిన అబీగయీలుకు పుట్టిన దానియేలు రెండవ కుమారుడు;

గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకా కుమారుడైన అబ్షాలోము మూడవ కుమారుడు;

హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు;

అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు;

దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు.

ఈ ఆరుగురు దావీదుకు హెబ్రోనులో పుట్టినవారు. అక్కడ అతడు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు.

దావీదు యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.

యెరూషలేములో అతనికి పుట్టినవారు వీరు:

అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబకు1 పుట్టిన షమ్మువ,2 షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కుమారులు.

ఇభారు, ఎలీషువ,3 ఎలీఫెలెతు, నోగహు, నెఫెగు, యాఫీయ, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు. మొత్తం తొమ్మిదిమంది ఇతర కుమారులు.

ఉంపుడుగత్తెల ద్వారా దావీదుకు పుట్టిన కుమారులు కాకుండా వీరందరు దావీదు కుమారులు. తామారు వీరికి సోదరి.

యూదా రాజులు

సొలొమోను కుమారుడు రెహబాము,

అతని కుమారుడు అబీయా,

అతని కుమారుడు ఆసా,

అతని కుమారుడు యెహోషాపాతు,

అతని కుమారుడు యెహోరాము,4

అతని కుమారుడు అహజ్యా,

అతని కుమారుడు యోవాషు,

అతని కుమారుడు అమజ్యా,

అతని కుమారుడు అజర్యా,

అతని కుమారుడు యోతాము,

అతని కుమారుడు ఆహాజు,

అతని కుమారుడు హిజ్కియా,

అతని కుమారుడు మనష్షే,

అతని కుమారుడు ఆమోను,

అతని కుమారుడు యోషీయా.

యోషీయా కుమారులు:

మొదటి కుమారుడు యోహానాను,

రెండవవాడు యెహోయాకీము,

మూడవవాడు సిద్కియా,

నాలుగవవాడు షల్లూము.

యెహోయాకీము వారసులు:

యెహోయాకీను,5

అతని సోదరుడు6 సిద్కియా.

చెర తర్వాత రాజ వంశస్థులు

ఖైదీగా ఉన్న యెహోయాకీను సంతానం:

అతని కుమారుడు షయల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.

పెదాయా కుమారులు:

జెరుబ్బాబెలు, షిమీ.

జెరుబ్బాబెలు కుమారులు:

మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సోదరి. మరో అయిదుగురు కూడా ఉన్నారు: హషుబా, ఒహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్-హెసెదు.

హనన్యా వారసులు:

పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులు, అర్నాను కుమారులు, ఓబద్యా కుమారులు, షెకన్యా కుమారులు.

షెకన్యా వారసులు:

షెమయా, అతని కుమారులు: హట్టూషు, ఇగాలు, బారియహు, నెయర్యా, షాపాతు మొత్తం ఆరుగురు.

నెయర్యా కుమారులు:

ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము మొత్తం ముగ్గురు.

ఎల్యోయేనై కుమారులు:

హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని మొత్తం ఏడుగురు.

Source notes (6)
  1. Footnote కొ.ప్రా.ప్ర. లలో బత్-షుయ 2 సమూ 11:3
  2. Footnote హెబ్రీలో షిమ్యా షమ్మువ మరొక రూపం
  3. Footnote కొ.ప్ర.లలో ఎలీషామా
  4. Footnote హెబ్రీలో యోరాము యెహోరాము యొక్క మరో పేరు
  5. Footnote యెకొన్యా యెహోయాకీను యొక్క మరొక పేరు
  6. Footnote హెబ్రీలో కుమారుడు, 2 దిన 36:10 చూడండి

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.