Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు 46:10
Verse 10 is marked below, with the whole chapter around it. Read from the start
సంగీత దర్శకునికి. అలామోతు రాగంలో కోరహు కుమారుల గీతము.
దేవుడు మనకు ఆశ్రయం బలం,
ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం
కాబట్టి భూమి మార్పుచెందినా,
నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.
జలాలు గర్జించినా నురుగు కట్టినా
పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా
అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి,
అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము.
అందులో దేవుడున్నారు, అది కూలదు;
తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.
దేశాలు గందరగోళంలో ఉన్నాయి, రాజ్యాలు కూలిపోతాయి;
దేవుని స్వరం ఉరుముతుంది, భూమి కరుగుతుంది.
సైన్యాల యెహోవా మనతో ఉన్నారు;
యాకోబు దేవుడు మనకు కోట. సెలా
రండి యెహోవా చేసిన క్రియలను చూడండి,
లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి.
ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద
యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు.
విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు;
రథాలను1 అగ్నితో కాల్చేస్తారు.
“ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి;
దేశాల్లో నేను హెచ్చింపబడతాను,
భూమి మీద నేను హెచ్చింపబడతాను.”
సైన్యాల యెహోవా మనతో ఉన్నారు;
యాకోబు దేవుడు మనకు కోట. సెలా
Source notes (1)
- Footnote లేదా కవచాలు
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం. Copyright © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. “Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.